పోలీస్ ఉద్యోగం కోసం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉచిత శిక్షణ – ఔత్సాహికులకు చందానగర్ పోలీసుల ఆహ్వానం

నమస్తే శేరిలింగంపల్లి: పోలీస్ విభాగంలో చేరి ఉద్యోగం చేయాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీస్ శాఖలో 18334 ఉద్యోగాలు ఉన్నాయి. మాదాపూర్ జోన్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆసక్తి ‌గల యువత చందానగర్ పోలీస్ స్టేషన్ లో పేరు నమోదు చేయించుకోవచ్చని తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు నిండి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు తమ ఆదార్ కార్డు, రెండు పాస్ ఫోటోలతో చందానగర్ పోలీస్ స్టేషన్ లో పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ ఫోన్ 8008029073, 040-27853911 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here