గోపన్ పల్లిలో ఈ శ్రమ్ కార్డు సెంటర్ ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి లో అసంఘటితరంగ కార్మికుల కోసం ఈ -శ్రమ్ కార్డు, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సెంటర్ ను బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. గోపన్ పల్లి లో రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ -శ్రమ్ కార్డు, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డు దరఖాస్తు చేసుకునేలా శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ‌కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కార్మికుల‌ కోసం ఈ-శ్రమ్ కార్డ్ ను రూపొందించారని అన్నారు. ఈ-శ్రమ్ కార్డ్ కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక కార్డు అన్నారు. గృహ నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, మధ్యాహ్నం భోజన కార్మికులు, హమాలీ కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, చాకలి, రిక్షా కార్మికులు, కూలీ పనులకు వెళ్లే వారు, వ్యవసాయ కూలీలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, కార్మికులు ఈ శ్రమ్ కార్డును పొందవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ అనుసంధానమైతే సులభంగా ఆయుష్మాన్ హెల్త్ కార్డు పొందవచ్చన్నారు.ఈ హెల్త్ కార్ట్ ప్రతి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ లో చెల్లుబాటు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు రంగస్వామి ముదిరాజ్, ముర్గ, చిన్న, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఈ శ్రమ్ కార్డును అందజేస్తున్న రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here