నమస్తే శేరిలింగంపల్లి: ప్రతీ కాలనీ, బస్తీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, సీసీ రోడ్లు అభివృద్ధి చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక ఆలను కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మంగళవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.ప్రతి కాలనీ,బస్తీ అభివృద్ధికి కృషి చేస్తామని, తమ దృష్టికి వచ్చే ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని జడ్సీని కోరారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ మైనారిటీ అధ్యక్షులు రహీం, నాయకులు లియకత్, ఇమ్రాన్, సుధాకర్, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
