భవానీపురంలో ప్రతి రెండో శనివారం శ్రమదానం

నమస్తే శేరిలింగంపల్లి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మన ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలంటేనే ఆలోచిస్తున్న రోజులివి. అలాంటిది ఓ కాలనీ అసోసియేషన్ వారు తమ పనులన్నీ పక్కన పెట్టి కాలనీ పరిశుభ్రతకు శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టేలా నిర్ణయించారు. చందానగర్ డివిజన్ భవానిపురం కాలనీ అసోసియేషన్ సభ్యులు కాలనీని‌ పరిశుభ్రంగా ఉంచేలా ప్రతి రెండో శనివారం రోజు ఉదయము శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టాలని తీర్మానించారు. అందులో భాగంగా శనివారం భవానిపురం కాలనీలోని రోడ్డు నం. 6 నుంచి రోడ్డు నం.1 వరకు శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టారు. ఖాళీ ప్రదేశంలోని చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఎలాంటి వ్యాధులు సోకకుండా ఆరోగ్యంగా ఉంటారని కాలనీ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

భవానీపురం‌ కాలనీలో చెత్తాచెదారాన్ని తొలగిస్తున్న కాలనీ అసోసియేషన్ ‌సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here