నమస్తే శేరిలింగంపల్లి: ప్రధానమంత్రి మోడీ పాలనకు ప్రజలు ఆకర్షితులై నాలుగు రాష్ట్రాలలో బిజెపి పాలనను కోరుకున్నారని బిజెవైఎం రాష్ట్ర నాయకురాలు, చందానగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి అన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల ఫలితాలు ప్రగతికి పట్టం కట్టాయని, కులమతాలకు అతీతంగా ప్రజలు తీర్పు చెప్పారని పేర్కొన్నారు. బిజెపిని ఓడించాలని అబద్ధాలు, అసత్యాలు, కుట్రలు ఎన్ని చేసినా ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పు చెప్పారని అన్నారు. అసత్య ప్రచారాలు, కుల, మత విద్వేషాలను ప్రజలు అధిగమించి సమర్థ పాలనకు ఓటు వేశారన్నారు. పంజాబ్ ప్రజలు ఇచ్చిన తీర్పు విలక్షణంగా ఉన్నా, ఆప్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కసిరెడ్డి సింధూ అన్నారు. ఉత్తర భారత ఫలితాల ప్రభావం తెలంగాణ పై ఉంటుందని, భవిష్యత్ తెలంగాణ బిజెపి దేనిని ధీమా వ్యక్యం చేశారు.