నమస్తే శేరిలింగంపల్లి: పేద ప్రజల పెన్నిధి, బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి అమరజీవి కామ్రెడ్ తాండ్ర కుమార్ సంస్మరణ సభను మార్చి 13 న నిర్వహించనున్నట్లు ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కామ్రేడ్ తుకారాం నాయక్ పిలుపునిచ్చారు. మియాపూర్ లోని మంగళవారం మార్కెట్ స్థలం లో ఆదివారం సాయంత్రం 4గంటలకు నిర్వహించనున్న తాండ్ర కుమార్ సంస్మరణ సభ కు ప్రజలు, ప్రజాతంత్ర వాదులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.