కేసీఆర్ పథకాలతో ఆడబిడ్డలంతా‌ ఆనందంగా ఉన్నారు – కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలతో తెలంగాణ రాష్ట్రంలోని ఆడ బిడ్డలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో మహిళా బందు కేసీఆర్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళా పారిశుధ్య కార్మికులు, అంగన్ వాడి వర్కర్స్, ఏఎన్ఏంలు, స్వయం సహాయక మహిళా నాయకురాళ్లు, మహిళా కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి సోదరభావంతో రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ ఒక అన్నలా ఉంటూ, తల్లులకు పెద్ద కొడుకుల ఉంటూ, మహిళలకు ఎంతో చేయూతను అందిస్తున్నారని అన్నారు. అనంతరం మహిళా పారిశుధ్య కార్మికులు, అంగనవాడి వర్కర్స్, ఏఎన్ఏంలు, స్వయం సహాయక మహిళా నాయకురాళ్లు, మహిళా కార్యకర్తలకు శాలువాలతో సన్మానం చేసి, చీరలను పంపిణి చేశారు. కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణగౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె. బలరాం యాదవ్, సీనియర్ నాయకులు తిరుపతి యాదవ్, నిర్మల, రూపరెడ్డి, బాలమణి, శ్యామల, కవిటి లక్ష్మి, రఫియా బేగం, హాలీమా బేగం, విజయశాంతి, నర్సిన్ బేగం, లక్ష్మికాంతం, నాగశ్రీలత, కళ్యాణి, లక్ష్మి, శైలజ తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సంబురాలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here