నమస్తే శేరిలింగంపల్లి: బాలికల వికాసానికి సేవా భారతి తోడ్పాటునందిస్తూ ప్రపంచానికి మంచి సందేశాన్ని అందిస్తోందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. సేవా భారతి ఆధ్వర్యంలో రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ 6వ ఎడిషన్ పేరిట మియాపూర్ క్యాస్ట్లీ టౌన్ స్కూల్ నుండి ప్రారంభమైన 5కే రన్ జేపీ నగర్, మక్త, హెచ్ఎంటి కాలనీ, ప్రశాంత్ నగర్ శ్రీరామ దేవాలయం వరకు ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని కిషోరి వికాస్ నగర సంచాలక్ జయప్రద ప్రముఖులతో కలసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ బాలికల విద్యను ప్రోత్సహిస్తున్నారని, స్త్రీ, పురుషుల మధ్యనున్న వ్యత్యాసాలను తగ్గించేందుకు సమాజంలో మరింత చైతన్యం తీసుకరావాల్సిన అవసరం ఉందన్నారు. సేవా భారతి స్వచ్ఛంద సంస్థ తెలంగాణలో 185 కిశోర్ వికాస్ కేంద్రాల ద్వారా బాలికలకు విద్య, వృత్తి విద్యలో శిక్షణ ఇస్తుందని అన్నారు. 10వేల మంది ఆడపిల్లల శక్తిసామర్ధ్యాలను, వారి నైపుణ్యాలను ప్రపంచానికి చాటే మోటివ్ తో కొనసాగిన ఈ 5k రన్ లో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సేవా భారతికి చెందిన పబ్లిక్ రిలయన్స్ గురు కొత్త జీ, ప్రముఖ్ భాస్కర్ జీ, నగర సంఘ్ చాలక్ భూషణ్ జీ, సంఘ్ పరివార్ సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.