నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చందానగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. బస్తీ దవాఖానా లలో పనిచేస్తున్న మహిళ సిబ్బందికి, ఆశ వర్కర్లకు,అంగన్ వాడీ కార్యకర్తలకు, ఆర్.పి సిబ్బందికి, టీఆర్ఎస్ మహిళ ప్రతినిధులకు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సన్మానించారు. మహిళల అభివృద్ధికి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ మహిళ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల కోసం షీ-టీమ్స్, భోరసా కేంద్రాలు, బాలామృతం, గర్భిణీ మహిళల కోసం కేసీఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ మహిళ ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.