నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ 2018 లో ఎన్నికల హామీల్లో రెడ్డిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూడాలని వెల్ఫేర్ అసోసియేషన్ ఆప్ రెడ్డి రాష్ట్ర సంక్షేమ సంఘం, శేరిలింగంపల్లి రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు నల్లా సంజీవ రెడ్డి మాట్లాడుతూ 2018 ఎన్నికల మెనొఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ ను వెయ్యి కోట్లతో ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ పార్టీ హామీనిచ్చిందన్నారు. రెడ్డిల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసేలా చూడాలని, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రెసిడెంట్ కె. దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గున్నాల అనీల్ రెడ్డి, శేరిలింగంపల్లి రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి డి .రవీందర్ రెడ్డి, బ్రహ్మనంద రెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రంగారెడ్డి, రమణారెడ్డి, గడ్డం రవీందర్ రెడ్డి, అజయ్ కుమార్ రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు.