నమస్తే శేరిలింగంపల్లి: మహిళల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా ప్రవేశపెట్టని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మూడు రోజుల వేడుకల్లో భాగంగా మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళ బంధు కేసీఆర్ పేరిట సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలతో రాఖీ కట్టించారు. పారిశుద్ధ్య కార్మిక మహిళలకు, రిసోర్స్ పర్సన్లకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శాలువాతో ఘనంగా సత్కరించి చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఓ వత్సలా దేవి, సీఓ లక్ష్మీ, వైదేహీ, అక్షర, డాక్టర్ శృతి, నాయకులు చంద్రికా ప్రసాద్, రోజా, సుప్రజ, రాణి, సుజాత, కల్పన, లావణ్య, వాణి, లత, మరియమ్మ, శ్రీదేవి, లక్ష్మి, చందన, సునీత, మంజుల, మహేశ్వరి, జయలక్ష్మి, భవాని, స్వరూప, జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది, ఆశావర్కర్లు, అంగన్ వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.