నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించడం గర్వంగా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, రోజాదేవి రంగారావు, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, ఆయా డివిజన్ల పార్టీ అధ్యక్షులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మహిళా బంధుగా భావిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 6,7,8 తేదీల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి మహిళా ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మహిళబందు కెసీఆర్ పేరిట సంబరాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 6వ తేదీన సంబరాల ప్రారంభం, సీఎం కేసీఆర్ కు రాఖీ కట్టడం,
పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం ఉంటుందన్నారు. కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, థాంక్యూ కేసీఆర్ అనే ఆకారంలో మానవహారాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. 7వ తేదీన మహిళా సంక్షేమ కార్యక్రమాలు కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా వారి ఇళ్ల వద్ద కలిసి సెల్ఫీలు దిగడం, 8వ తేదీన నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశం, సంబరాలు జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, వీరేశం గౌడ్, డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, రాజు యాదవ్, రాజు నాయక్, గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, లక్ష్మీ నారాయణ, నాయకులు మిరియాల రాఘవరావు, వాలా హరీష్, తదితరులు పాల్గొన్నారు.