నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి ఓబీసీ మోర్చా చందానగర్ డివిజన్ అధ్యక్షునిగా గడ్డం కనకరాజు కురుమను నియమించారు. ఈ మేరకు బిజెపి చందానగర్ డివిజన్ అధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్ గడ్డం కనకరాజుకు నియామకపు పత్రాన్ని అందజేశారు. గడ్డం కనకరాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ విధానాలకు కట్టుబడి డివిజన్ లోని నాయకులు, కార్యకర్తల సహకారంతో పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ క్రిష్ణ రెడ్డి, ఆగం రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా ఓబీసి మోర్చ ప్రధాన కార్యదర్శి సూర్న శ్రీశైలం కురుమ, శేరిలింగంపల్లి ఓబీసి మోర్చ అసెంబ్లీ కన్వీనర్ పృథ్వికాంత్ గౌడ్, చందానగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ముదిరాజ్, బీజేవైఎం అధ్యక్షులు మల్లేష్ గౌడ్, చారి, ప్రభు ముదిరాజ్, వెంకట్ కురుమ తదితరులు పాల్గొన్నారు.