నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర చేశారు. కాలనీలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూజీడీ, సీసీ రోడ్లు, తదితర సమస్యలపై కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి అభివృద్ధిపథంలో ముందుకు వెళ్తామని అన్నారు. ఆదర్శ్ నగర్ కాలనీని అన్ని కాలనీలకు ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్ మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, లక్ష్మణ్ యాదవ్, సత్యనారాయణ, దివాకర్ రెడ్డి, రాజు, సుధాకర్ రెడ్డి, బస్వరాజ్, పట్లోళ్ల నర్సింహారెడ్డి, జమ్మయ్య, భాగ్యలక్ష్మి, సౌజన్య, జయ, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.

మార్కెట్ లోని సమస్యలపై వినతి
శేరినల్లగండ్ల మార్కెట్ లోని సమస్యలను పరిష్కరించాలంటూ విక్రయదారులు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు వార్డు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మార్కెట్ లో పాత షెడ్ల రేకులను తొలగించి కొత్త షెడ్లను ఏర్పాటు చేయిస్తామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హామీనిచ్చారు. మార్కెట్ లో కనీస మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు, డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, షేక్ ఖాజా షేక్ అహ్మద్, రాంచందర్, శ్రీనివాస్, సాయి, మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు.
