బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు అందుకున్న రష్మిత

నమస్తే శేరిలింగంపల్లి: అనాథలకు ఆపన్నహస్తంలా, వికలాంగులకు చేయూతగా ప్రతిమ ఫౌండేషన్ నిలుస్తూ అందరి మన్ననలను పొందడం అభినందనీయమని ప్రముఖ తెలుగు సినీ హీరో సుమన్ అన్నారు. జనని ఫౌండేషన్ ఆవిష్కరణలో సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు సామాజిక సేవలందించి అందరి మన్ననలు పొందిన ప్రతిమ ఫౌండేషన్ అధ్యక్షురాలు పాడి రష్మిత కు బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు లభించింది. ఈ అవార్డును సినీ హీరో సుమన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ వైద్య, మహిళా, శిశు, సంక్షేమం తో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లో ప్రతిమ ఫౌండేషన్ ముందుండి మంచిపేరు తెచ్చుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనని ఫౌండేషన్ చైర్ పర్సన్ పద్మావతి గౌడ్, రాష్ట్ర ఓబిసి విభాగ అధికార ప్రతినిధి కుడుపూడి శ్రీనివాస్, నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సీరవేన స్వప్న నాగరాజు, ప్రముఖ సంఘ సేవకులు, తదితరులు పాల్గొన్నారు.

బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు ను సినీ నటులు సుమన్ చేతుల మీదుగా అందుకుంటున్న రష్మిత
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here