రూ. 15.88 కోట్లతో నాలా విస్తరణ పనులు – శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ, జడ్సీ ప్రియాంక, కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి: రాబోయే వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గం లో నాలా‌ విస్తరణ పనులను చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు నుండి దీప్తి శ్రీ నగర్ నాలా వరకు రూ.15. 88 కోట్ల అంచనా వ్యయంతో 2.4 కి.మీ ల మేర చేపట్టనున్న నాలా విస్తరణ పనులకు జోనల్ కమిషనర్ ప్రియాంక ఆల, కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాలా విస్తరణ పనులపై ప్రణాళికలు రూపొందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, డీఈ విశాలాక్షి, ఏఈ ప్రతాప్, ఇరిగేషన్ డీఈ నళిని, ఏఈ శేషగిరిరావు, హాఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, అధ్యక్షుడు వాలా హరీష్ రావు, నాయకులు లక్ష్మా రెడ్డి, కిషన్ రావు, రవీందర్ రెడ్డి, యాదగిరి ముదిరాజ్, ప్రవీణ్ గౌడ్, జామీర్, సుబ్బు, ఉమామహేశ్వరరావు, విష్ణు, విజయ్ కుమార్, నాగేశ్వర్ రావు, రవి చందర్, మోహన్, వీరాజు,శేఖర్ ముదిరాజ్,రవి కుమార్,ఎస్సీ సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్, శ్రీనివాస్ గౌడ్, వెంకట్ రెడ్డి, సాయి యాదవ్, దేవేందర్, సుధాకర్, కృష్ణ, అంబేద్కర్, దామోదర్ రెడ్డి, వెంకటేశ్వర రావు, వేణు గోపాల్, సుదర్శన్ రాజు, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

నాలా విస్తరణ పనులకు జడ్సీ ప్రియాంక, కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here