నమస్తే శేరిలింగంపల్లి: పేద ప్రజల కోసం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పేట డివిజన్ ఇంజినీర్స్ ఎన్ క్లేవ్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో సిటిజన్ హాస్పిటల్ నల్లగండ్ల సౌజన్యం తో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ప్రతి రోజూ వ్యాయామం, యోగా తప్పనిసరిగా చేయాలన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తహ జబిన్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆంజనేయరాజు, జైపాల్ రెడ్డి, కరుణాకర్ గౌడ్, రంగారావు, చంద్రశేఖర్, రామిరెడ్డి, (ఆశ జనరల్ సెక్రటరీ) ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాలం శ్రీను, జనార్థన్, విష్ణుప్రసాద్, గంగాధర్, జిల్ మల్లేష్, హాస్పిటల్ ప్రతినిధి జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.