ఘనంగా ప్రారంభమైన శ్రీ భవాని శంకరాలయ ద్వావింశతి శివోత్సవాలు

నమస్తే శేరిలింగంపల్లి: విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత చందానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సముదాయంలోని శ్రీ భవాని శంకరాలయ ద్వావింశతి (22వ) శివోత్సవాలు ఈ నెల 19వ తేదీ శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి వార్ల దివ్యాశీస్సులతో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు శివోత్సవములు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజు శనివారం ఉదయం గణపతి పూజ, పుణ్య హవచనము, పంచగవ్యప్రాశన, అస్త్రరాజార్చన, దీక్షారాధణ కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం 5.30 గంటలకు పుట్ట మన్ను తెచ్చి అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, నిత్య హోమాలు, వృషభ వాహన సేవ, రాత్రి 8.30 గంటలకు ధ్వజారోహణ, హారతి‌ తీర్థ ప్రసాదాల వితరణ తదితర కార్యక్రమాలు ‌నిర్వహించారు.

శ్రీ భవాని శంకరాలయంలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు
శివోత్సవాల ప్రారంభంలో పుట్ట మన్ను తెస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here