రక్తదానం చేసిన ప్రభుత్వ విప్ గాంధీ – మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ జాతిపిత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల‌్లో భాగంగా రెండో రోజు బుధవారం కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, రోజా దేవి రంగారావు, మాజీ కార్పొరేటర్ సాయిబాబా తో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో రక్తదానం చేస్తున్న ఎమ్మెల్యే గాంధీ

అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న అని, కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని 300 మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ రక్తదానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందస్తుగా నియోజకవర్గం ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వరద చారి, మాజీ కార్పొరేటర్లు రవీందర్ ముదిరాజ్, రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, రాజు యాదవ్, కృష్ణ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, గౌతమ్ గౌడ్, సమ్మారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు,‌ తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం శిబిరంలో పాల్గొన్న వారికి సర్టిఫికేట్లను అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here