ఈ శ్రమ్ గుర్తింపు కార్డులను సద్వినియోగం చేసుకోండి – బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: బడుగు బలహీన వర్గాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ గుర్తింపు కార్డులను సద్వినియోగం చేసుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేటలో ఈ-శ్రమ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ అసంఘటితరంగ కార్మికుల కోసం ఈ శ్రమ్ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ-శ్రమ్ కార్డు పొందిన కూలీలు దేశంలో ఎక్కడైనా ఉపాధి పొందవచ్చని అన్నారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదైన కార్మికునికి రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర్ గౌడ్, రాఘవేందర్ రావు, మాణిక్, లక్ష్మణ్ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, మల్లేశ్, జె శ్రీను, రాము, శివరాజ్ ముదిరాజ్, బాబు, వినోద్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ , రమేష్ రెడ్డి , బాబీ తదితరులు పాల్గొన్నారు.

ఈ శ్రమ్ కార్డులను అందజేస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here