నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీ యువజన సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో యువజన సంఘం అధ్యక్షునిగా భేరి శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షునిగా పంతం శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీగా భువన్, ట్రెజరర్ గా వాసు, సభ్యులు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన యూత్ అధ్యక్షుడు భేరి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాలనీలో ఈ సమస్య వచ్చినా ముందుంటానని, కాలనీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కాలనీలోని యువతకు అండగా నిలుస్తానని అన్నారు. యూత్ అధ్యక్షునిగా ఎన్నుకునేందుకు సహకరించిన నేతాజీ నగర్ కాలనీ యూత్ అసోసియేషన్ సభ్యులకు, కాలనీ పెద్దలకు, యువజన నాయకులకు, సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు.
