నమస్తే శేరిలింగంపల్లి: విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ బిల్లు వసూలు కోసం వెళ్లిన లైన్ మెన్ పై ఓ ఫ్లాట్ యజమాని దాడి చేసిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. మియాపూర్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. విద్యుత్ శాఖలో లైన్ మెన్ గా పనిచేస్తున్న మోహన్ శనివారం సాయంత్రం చందానగర్ సర్కిల్ పరిధిలోని మదీనాగూడ గ్రామంలో విద్యుత్ బిల్లుల వసూలు కోసం వెళ్లాడు. ఈ క్రమంలో ఓ ఫ్లాట్ యజమాని రోహిత్ బాబు కు, లైన్ మెన్ మోహన్ కు మాటమాట పెరిగి వాగ్వాదం చోటుచేసుకోవడంతో మోహన్ పై రోహిత్ దాడికి దిగాడు. దీంతో మోహన్ తలకు గాయం కావడంతో ఫ్లాట్ యజమాని రోహిత్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.