నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత వాక్సినేషన్ డ్రైవ్, వ్యాక్సినేషన్ పై ప్రజల్లో మరింత విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, స్వస్థ్య స్వయం సేవక్ అభియాన్ ఇంచార్జి జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. కరోనా థర్డ్ వేవ్ మహమ్మారి తాండవిస్తున్న తరుణంలో ప్రజల ఆరోగ్య దృష్ట్యా జాతీయ పార్టీ ఆదేశాల మేరకు ఎల్ బి నగర్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా బిజెపి కార్యాలయంలో స్వస్థ్య స్వయం సేవక్ అభియాన్ సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రంలో చేపడుతున్న ఉచిత వాక్సినేషన్ సెంటర్ ను సందర్శించాలని అన్నారు. ప్రతి డివిజన్ బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, కమిటీ సభ్యులు భాస్కర్, హరిప్రియ, వంశీ, కార్పొరేటర్లు, కాంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, హెల్త్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.