నేతాజీ హలో గ్రామ్ విగ్రహం ఏర్పాటు పట్ల ప్రధాని మోడీకి కృతజ్ఞతలు – బిజెవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా జితేందర్

నమస్తే శేరిలింగంపల్లి: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ హలో గ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల ప్రధాని నరేంద్రమోడీ కి బిజెవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బిజెవైఎం మియపూర్ డివిజన్ ఆధ్వర్యంలో మియపూర్ పోస్టాఫీస్ వద్ద ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఫోస్టు కార్డుల ద్వారా ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా కుమ్మరి జితేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు అవకాశవాద రాజకీయాల కోసం నేతాజీ జీవిత చరిత్రను వక్రీకరించి కనుమరుగు చేయడానికి ప్రయత్నిస్తే, ప్రధాని నరేంద్రమోడీ నేతాజీ చరిత్రను, పోరాటాలను ప్రపంచానికి తెలియజేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో భారత దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన ఎందరో మహానుభావులను స్మరించుకుంటూ, వారి స్మారక కేంద్రాలను, ప్రత్యేకమైన పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేసి దేశ పౌరులకు అందించడం శుభపరిణామమని పేర్కొన్నారు. దేశ యువతకు విలువలను, వారు దేశం కోసం చేసిన పోరాటాలను తెలిసేలా కృషి చేస్తున్నారన్నారు. నరేంద్రమోదీ లాంటి ప్రధాని మనకు ప్రధానిగా ఉండటం దేశ ప్రజలు చేసుకున్న అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు సిద్ధూ, బిజెవైఎం నాయకులు నవీన్ రెడ్డి, నందు, మున్నూర్ సాయి, శ్రీను, భాస్కర్, భారత్, శ్రీధర్, కమల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఫోస్టు కార్డుల ద్వారా ప్ర ప్రదాన మంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్న బిజెవైఎం నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here