నమస్తే శేరిలింగంపల్లి: నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం అమానుషమని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఖండించారు. ఎంపీ అరవింద్ పై జరిగిన దాడిని ఖండిస్తూ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కు తరలివెళ్ళారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ను పరామర్శించి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో నిరంకుశత్వ పాలన సాగుతోందని రవికుమార్ యాదవ్ అన్నారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని, దాడికి సహకరించిన రాష్ట్ర పోలీస్ కమిషనర్ ను విధుల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
