నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలు ఇళ్లల్లోని చెత్తాచెదారాన్ని, ప్లాస్టిక్ కవర్లను బయటి ప్రదేశాలలో వేయకుండా స్వచ్చ్ ఆటోల్లో వేసి పారిశుధ్య పరిరక్షణకు కృషి చేయాలని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరీ రాంచందర్ యాదవ్ సూచించారు. నేతాజీ నగర్ కాలనీలోని పలు ఓపెన్ నాలాల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు నిండి దుర్వాసన రావడంతో భేరీ రాంచందర్ యాదవ్, ఉపాధ్యక్షుడు రాయుడు జలమండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన జలమండలి అధికారులు సిబ్బందిని పంపించి నాలాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగింపజేశారు. ఈ సందర్భంగా భేరీ రాంచందర్ యాదవ్ మాట్లాడుతూ కాలనీ వాసులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. నాలాల్లో ల, బయటి ప్రదేశాల్లో చెత్తాచెదారం వేయరాదని సూచించారు. సమస్యను పరిష్కరించిన జలమండలి మేనేజర్ యాదగిరి, సూపర్ వైజర్ సురేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.