నడిగడ్డ తండాలో పర్యటించిన ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: నడిగడ్డ తండాలో నెలకొన్న సీఆర్ పీ ఎఫ్ సమస్యను గతంలో పార్లమెంట్ లోనూ చర్చించామని, మరోసారి కేంద్ర హోం శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి తెలిపారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలలో పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, డీసీ సుధాంష్, ఇంజనీరింగ్ విభాగం, జలమండలి, ఎలక్ట్రికల్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. రాజకీయలకతీతంగా అభివృద్ధి చేశామని, రోడ్లు, డ్రైనేజీ, మంచి నీటి సమస్య లేకుండా చూశామని అన్నారు‌. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, డీఈ స్రవంతి, జలమండలి డీజీఎం నాగప్రియ, మేనేజర్ సాయి చరిత, ఎఎంహెచ్ఓ కార్తిక్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సంపత్, స్ట్రీట్ లైట్ ఏఈ రామ్మోహన్, ఎస్ఆర్పీ కనకరాజు, వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్, టీఆర్ఎస్ నాయకులు పురుషోత్తం యాదవ్, బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, గంగాధర్ రావు, మోహన్ ముదిరాజ్, ప్రతాప్ రెడ్డి, మాధవరం గోపాల్ రావు, మహేందర్ ముదిరాజ్, గోపరాజు శ్రీనివాస్ రావు, మహమ్మద్ ఖాజా, జాంగిర్, సుప్రజ, స్వరూప, హన్మంతరావు, రాజు గౌడ్, రవి గౌడ్, శివ ముదిరాజ్,‌ శ్రీను, వెంకటేష్, జంగం మల్లేష్, శ్రీధర్ ముదిరాజ్, దయానంద్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, రాజు ముదిరాజ్, వజీర్, రాజు, విజయ్ ముదిరాజ్, రాజు, నడిగడ్డ తండా వాసులు తిరుపతి నాయక్, స్వామి నాయక్, హన్మంతు నాయక్, శంకర్ నాయక్, రెడ్యానాయక్, సుధాకర్, కమలాకర్, అబ్రహం, రవికుమార్, తుకారాం నాయక్, రమేష్, లక్ష్మణ్, శ్రీను నాయక్, సుభాష్ చంద్రబోస్ నగర్ వాసులు రాములు నాయక్, బాలస్వామి, సంతోష్ ముదిరాజ్, సుభద్ర, చందు, శ్రీకాంత్ రెడ్డి, మారయ్య, పోచమ్మ, లక్ష్మణ్, గురువయ్య, నగేష్ ముదిరాజ్,‌ లక్ష్మణ్ ముదిరాజ్, స్వామి, కుమార్, నాగేశ్వరవు, తదితరులు పాల్గొన్నారు.

నడిగడ్డ తండాలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ప్రభుత్వ విప్ గాంధీ, ఎంపీ రంజిత్ రెడ్డి

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here