చందానగర్ సర్కిల్ పరిధిలో స్వచ్ఛ్ ఆటోలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి: పారిశుధ్య పరిరక్షణకు పాటుపడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ సర్కిల్ కార్యాలయంలో మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పెట్, చందానగర్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీ లకు కేటాయించిన 34 స్వచ్చ్ ఆటోలను డీసీ సుధాంష్, కార్పొరేటర్లు మంజులరఘునాథ్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్,‌ఏఎంఓహెచ్ డాక్టర్ కార్తిక్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ స్వచ్ఛ్ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణ కోసం చెత్త సేకరణ కోసం స్వచ్ఛ్ ఆటోలను అర్హులైన లబ్దిదారులకు అందజేయడం జరిగిందన్నారు. ఆటోలు ఆయా కాలనీలలో ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించి డంప్ యార్డ్ కి తరలించి, వీధులలో పేరుకుపోయిన చెత్తకుప్పలను తొలగిస్తూ స్వచ్ఛ కాలనీలు గా తీర్చిద్దిదటంలో ఈ ఆటోలు ప్రముఖ పాత్ర వహిస్తాయన్నారు. స్వచ్ఛ్ శేరిలింగంపల్లిగా తీర్చిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మన పరిసర ప్రాంతాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఇంట్లో చెత్తను తడి చెత్త ,పొడి చెత్తగా వేరు చేసి స్వచ్ఛ్ ఆటోల్లో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ పీ లు శ్రీనివాస్ రెడ్డి , మహేష్, కనకరాజు, ప్రసాద్, బాలాజీ, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు మాధవరం గోపాల్, గుమ్మడి శ్రీనివాస్, రాంచందర్, రవీందర్ రెడ్డి, అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ్ ఆటోలను ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here