నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని, మన ఊరు.. మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతుల కల్పనతో పాటు ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టడం సంతోషకరమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ ప్రభుత్వ పాఠశాలలో కోటి నలభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 9 అదనపుతరగతి గదుల నిర్మాణ పనులకు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధి చెందేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. కేజీ టు పీజీ విద్యను ప్రవేశపెట్టడం, గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రయివేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కు ప్రత్యేక చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వసుంధర, నాయకులు బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, గంగాధర్ రావు, మోహన్ ముదిరాజ్, ప్రతాప్ రెడ్డి, మాధవరం గోపాల్ రావు, మహేందర్ ముదిరాజ్, గోపరాజు శ్రీనివాస్ రావు, మహమ్మద్ ఖాజా, జాంగిర్, సుప్రజ, స్వరూప, హన్మంతరావు, రాజు గౌడ్,రవి గౌడ్, శివ ముదిరాజ్, శ్రీను, వెంకటేష్, జంగం మల్లేష్, శ్రీధర్ ముదిరాజ్, దయానంద్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, రాజు ముదిరాజ్, వజీర్, రాజు, విజయ్ ముదిరాజ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.