నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని బిక్షపతి నగర్ కాలనీలలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, జలమండలి అధికారులు, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ బిక్షపతి నగర్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని, మ్యాన్ హోల్ లో పేరుకుపోయిన చెత్త చెదారంను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని ప్రభుత్వ విప్ గాంధీ సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ ప్రశాంత్, వాటర్ వర్క్స్ జీఎం రాజశేఖర్, డీజీఎం నారాయణ, మేనేజర్ నివర్తి, స్ట్రీట్ లైట్ డీఈ కిషన్, టీఆర్ఎస్ నాయకులు జంగం గౌడ్, మహేష్, తానాజీ, చోటమియా, అహ్మద్ బాయ్, గౌస్, శ్రీనివాస్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
