నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగుడా లోని హరిజన బస్తీ, రజక బస్తి, తెనుగు బస్తి, పుకెట్ నగర్ కాలనీ లలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికై ఇంజనీరింగ్, జలమండలి అధికారులు, మాజీ కార్పొరేటర్ సాయి బాబాతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పర్యటించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నానక్ రాంగుడాలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, మంచి నీరు, రోడ్లు, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ తదితర సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ విప్ గాంధీ సానుకూలంగా స్పందించి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ రమేష్, ఏఈ కృష్ణ వేణి, జలమండలి జీఎం రాజశేఖర్, డీజీఎం నారాయణ, స్ట్రీట్ లైట్ డీఈ కిషన్, నాయకులు రాగం జంగయ్య యాదవ్, మల్లేష్, రమేష్ గౌడ్, పూరుడి కృష్ణ, గోవిందు, అర్. నారాయణ, అనిల్ సింగ్, బస్తీ వాసులు అనిల్ కుమార్, నరేష్, బాలకృష్ణ, చంద్రశేఖర్, మహేందర్, రాజు, గోపాల్, యాదయ్య, సంతోష్, నరసింహ, దశరథ్, శ్రవణ్, సంతోష్, బాలరాజు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.