నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా జ్ఞానేంద్రప్రసాద్ తన నివాసం వద్ద బోగి మంటలు అంటించి ప్రజలందరికి బోగి పండగ శుభాకాంక్షలు తెలిపారు. బోగి మంటలతో ప్రజల ఇళ్లల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
