నమస్తే శేరిలింగంపల్లి: సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థులతో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలోని సమస్కృతి పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సంక్రాంతి పండగకు వారం రోజుల ముందుగానే పాఠశాలలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం సంతోషకరమని తెలిపారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని విద్యార్థులు రంగ వల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, కోడి పందాలు, బొమ్మల కొలువులు, పాడి పంటలు, తదితర అంశాలపై సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సురేష్ బాబు, ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.