విద్యార్థి దశ నుంచే ప్రశ్నించేతత్వం అలవరుచుకోవాలి- మాదాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్ : శారదా స్కూల్ లో ఘనంగా వివేకానందుని 159 వ జయంతి ఉత్సవాలు

నమస్తే శేరిలింగంపల్లి: సమాజంలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, విద్యార్థి దశ నుంచే ప్రశ్నించేతత్వాన్ని అలవరుచుకోవాలని మాదాపూర్ బిజెపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ సూచించారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని శారదా స్కూల్ లో స్వామీ వివేకానంద 159వ జయంతి ఉత్సవాలలో భాగంగా ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామీ వివేకానంద చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గంగల రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ప్రశ్నించే తత్త్వం అలవడితే అది మన జీవితంలో ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు. తప్పు జరిగితే చూసి వదిలివేయకుండా విద్యార్ధి దశ నుండే ప్రశ్నించేతత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు. విద్యార్థులందరూ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. స్వామి వివేకానందుడు చెప్పినట్టు మందలో ఒకరిగా కాకుండా వందలో ఒకరిగా ఉండాలని అన్నారు. వివేకానందుని అడుగుజాడల్లో పయనించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. తాను చదివిన స్కూల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించిన శారద స్కూల్ కరస్పాండెంట్ నరేంద్రబాబు (చిన్న)కు రాధాకృష్ణ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శారదా స్కూల్ కరస్పాండెంట్ నరేంద్రబాబు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం శ్రావణి, శ్రీనివాసరావు, కిరణ్, లక్ష్మి, శారద, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.

శారదా స్కూల్ లో నిర్వహించిన స్వామి వివేకానందుని జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాధాకృష్ణ యాదవ్
వివేకానందుని జయంతి ఉత్సవాలలో పాల్గొన్న విద్యార్థినీవిద్యార్థులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here