అనారోగ్యంతో బిక్షాటకురాలు మృతి

నమస్తే శేరిలింగంపల్లి: బిక్షాటన చేసుకుంటూ పూట గడుపుకుంటున్న ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మియాపూర్ కల్వరి టెంపుల్ రోడ్డులో బిక్షాటన చేసుకునే మహిళ అపస్మారక స్థితిలో పడిపోయింది. అదే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న బ్లూ కోర్టు కానిస్టేబుల్ గోపి కి గుర్తు తెలియని మహిళ ద్వారా సమాచారం అందగా అక్కడకు చేరుకున్నాడు. అపస్మారక స్థితిలో పడిపోయిన మహిళను వైద్య చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. గోపి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.

బిక్షాటకురాలు మృతదేహం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here