నమస్తే శేరిలింగంపల్లి: పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో అత్యవసర చికిత్స నిమిత్తం ద్వారా ఆస్పత్రుల్లో బిల్లులు చెల్లించి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న 21 మంది బాధితులకు మంజూరైన రూ. 16.27 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వ విప్ గాంధీ కార్పొరేటర్ రోజాదేవి రంగారావు తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు నిరంతరం సేవలందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు రంగారావు, రవీందర్ ముదిరాజ్, కూకట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నాయకులు సాంబశివరావు, జిల్లా గణేశ్, బ్రిక్ శ్రీనివాస్, ఎల్లం నాయుడు, అంజనేయులు, అనిల్ కావూరి, నరేష్, తిరుపతి పాల్గొన్నారు.