నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సంక్రాంతి సంబురాలు సందర్భంగా నూతన సంవత్సరం రోజున రవీంద్ర భారతిలో సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. విశ్వ కళా మండలి ఫౌండర్ అధ్యక్షుడు కె రాం నర్సయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఫిల్మ్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఆహుతులను ఆకట్టుకునేలా కూచిపూడి నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులను అభినందించారు. చిన్నారులకు శిక్షణ ఇచ్చిన నాట్య గురువులు రాం నర్సయ్యను ప్రశంసించారు. అనంతరం జర్నలిస్టు, గాయకుడు పి లక్ష్మణ్ రావును సన్మానించారు ఈ కార్యక్రమంలో మిమిక్రీ కళాకారులు, సీనియర్ కళాకారుడు మల్లం రమేష్, వేణు గోపాల్, నరేష్, రామకృష్ణ, నాట్య గురువులు ఉదయశ్రీ వినయ్ చౌదరి, రమేష్ బిందు తదితరులు పాల్గొన్నారు.