నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధి పనుల కోసం వారు వెచ్చించిన కోట్లాది రూపాయలకు సంబంధించి జీహెచ్ఎంసీ నుంచి బిల్లులు రాక గత కొన్ని నెలలుగా సతమతమవుతున్న కాంట్రాక్టర్లు తమ ఆవేదనను వ్యక్త పరచడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేరు. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి జోన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కట్ల శేఖర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్స్ కమాన్ నుండి గచ్చిబౌలి స్టేడియం వరకు నిర్వహించిన 10కె రన్ ను హీరో నాని ఆదివారం ఉదయం ప్రారంభించారు. కాగ ఈ రన్ లో పాల్గొన్న శేఖర్ రెడ్డి 2021 మార్చి బిల్లులు చెల్లించండంటూ మెడలో, వీపులో ఒక అభ్యర్థన పత్రాన్ని అతికించుకోని నిరసన తెలిపాడు. ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చి బిల్లులు రాకుండ అడ్డుకుంటున్న కమిషనర్ దిగొచ్చే వరకు తమ శాంతియుత నిరసనలను విస్తృతం చేస్తామని అన్నారు. రన్ లో పాల్గొన్న వేలాది మంది కాంట్రాక్టర్ల ఆవేదనను అర్థం చేసుకోని బరోసా ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జీహెచ్ఎంసి ఉన్నతాధికారులు స్పందిస్తారని ఆశాబావం వ్యక్తం చేశారు.