డ్రైనేజీ వ్యవస్థపై జలమండలి అధికారులతో ప్రభుత్వ విప్ గాంధీ సమీక్ష

నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి నియోజకవర్గం లో డ్రైనేజీ సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఎంతగానో ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. సివరేజ్ వ్యవస్థ జీహెచ్ఎంసీ నుంచి జలమండలి శాఖకు బదిలీ అయిన తర్వాత యూజీడీ వ్యవస్థలోని పనితీరు, విధివిధానాలపై జలమండలి అధికారులతో ప్రభుత్వ విప్ గాంధీ మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సివరేజ్ వ్యవస్థ నిర్వహణ జీహెచ్ఎంసీ నుంచి వాటర్ వర్క్స్ కు బదిలీ అయ్యాక వాటి పనితీరు ఎలా ఉందని అధికారులను అడిగారు. ప్రజల నుండి నేరుగా, ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ గ్రూప్ ల ద్వారా వచ్చే వినతులను, సమస్యలను 95 శాతం మేరకు పరిష్కరించడం జరుగుతుందని జలమండలి అధికారులు చెప్పారు. ఫిర్యాదు ద్వారా వచ్చిన సమస్యలను రెండుమూడు రోజులలో పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యేకు వివరించారు. అధికారులను అభినందించి మరింత పనిచేయాలని, ప్రజలకు ఏ సమస్య లేకుండా చూడాలని విప్ గాంధీ సూచించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా అవుతుండడంతో వాటర్ ట్యాంకర్ల డిమాండ్ తగ్గిందని అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి సంప్రదించాల్సిన జలమండలి కాల్ సెంటర్ ఫోన్ నంబర్ 155313, డివిజన్ల వారిగా జలమండలి అధికారుల ఫోన్ నంబర్ల వివరాలు:
1. సుబ్రమణ్యం చందనాగర్ మేనేజర్ -9989989045
2. నివర్తి మాదాపూర్ మేనేజర్ – 7995660978
3. సందీప్ కొండాపూర్ డివిజన్ మేనేజర్ – 9550731232
4. వెంకట్ రెడ్డి గచ్చిబౌలి డివిజన్ మేనేజర్ 7337350849
5. యాదయ్య శేరిలింగంపల్లి డివిజన్ మేనేజర్ 9154297400
6.సాయి చరిత మియాపూర్ డివిజన్ మేనేజర్ – 9154866702
7. పూర్ణేశ్వరి , హఫీజ్ పేట్ డివిజన్ మేనేజర్ -7331185747
8. సునీత దీప్తి శ్రీనగర్ మేనేజర్ – 9154867431
నంబర్లలో గాని, జలమండలి కాల్ సెంటర్ కు గాని, వాట్సప్ గ్రూప్ కు గాని ,ఎమ్మెల్యే కార్యాలయం గాని సంప్రదిస్తే వెంటనే సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్ , డీజీఎం లు శ్రీమన్నారాయణ, నాగప్రియ, మేనేజర్లు సుబ్రమణ్యం, నివర్తి, యాదయ్య, సందీప్, సాయి చరిత, ఈశ్వరి, సునీత తదితరులు పాల్గొన్నారు.

జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here