హఫీజ్ పేట్ డివిజన్ అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ పూజితగౌడ్ శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో కోటి రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, యూజీడీ పైపులైన్ నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డికి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా, కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

హఫీజ్ పేట్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here