కష్టపడేవారికి తప్పకుండా సముచితస్థానం: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: పార్టీ కోసం కష్టపడే వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ లో టీఆర్ఎస్ బస్తీ కమిటీని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరు సిఫాయిలాగా పని చేయాలని పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలో బస్తీ కమిటీలను వేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్టాలిన్ నగర్ నూతన బస్తీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

స్టాలిన్ నగర్ బస్తీ కమిటీ సభ్యులతో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here