నమస్తే శేరిలింగంపల్లి:చందానగర్ డివిజన్ పరిధిలోని భవానీపురం కాలనీలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మూడేళ్ల తర్వాత ఏర్పడిన కాలనీ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా టి. రఘునందన్ రెడ్డి, కార్యదర్శిగా ఎం. సుందరం, గౌరవాధ్యక్షునిగా ఎ. కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షునిగా కె. సందీప్, కోశాధికారిగా ఎంబి శ్రీనివాస రావు, సంయుక్త కార్యదర్శులుగా వైటీ కృష్ణారెడ్డి, ఎ పర్వత రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కిరణ్ బాబు, అడ్వయిజర్లుగా పి. లక్ష్మీకాంత్ రెడ్డి, రంగయ్య ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ సహకారంతో కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గం తెలిపింది.