ఆడపడుచుల‌‌ ఆనందాలకు అవదుల్లేవు: ప్రభుత్వ విప్‌ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండగ సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ అంబేద్కర్ మున్సిపల్ కళ్యాణ మండపంలో డీసీ సుధాంష్, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బతుకమ్మ చీరలను పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నియోజకవర్గ అడపడచుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బతుకమ్మ చీరలను అందుకుంటున్న  పేద మహిళల్లో ఆనందం కనబడుతోందని అన్నారు. బతుకమ్మ చీరల పంపిణీతో ఆరు దశాబ్దాలుగా దగాపడ్డ చేనేత వస్త్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం జీవంపోసిందని అన్నారు. కార్యక్రమంలో మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, సీఐ క్యాస్ట్రో రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ వత్సలా దేవి, మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, లక్ష్మీ నారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు మిరియాల రాఘవరావు, లక్ష్మారెడ్డి, జనార్దన్ రెడ్డి, కరుణాకర్ గౌడ్, దాసరి గోపి, వెంకటేష్, ప్రవీణ్, ఖాసీమ్, గురు చరణ్ దుబే, మిరియాల ప్రీతమ్, గుడ్ల ధనలక్ష్మి, అక్బర్ ఖాన్, గోవర్ధన్ రెడ్డి, దాస్, కొండల్ రెడ్డి, యశ్వంత్, ఎల్లమయ్య, అంజద్ పాషా, రఘునందన్, సుందర్, రమణ, రమేష్, వరలక్ష్మి, భవాని, సునీత తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ డివిజన్ లో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here