నమస్తే శేరిలింగంపల్లి: బతుకమ్మ పర్వదినం సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారెగా బతుకమ్మ చీరలను అందజేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని జేపీఎన్ నగర్ లో డీసీ సుధాంష్, స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండగ సందర్భంగా ఆడపడుచులకు చీరలను అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు నియోజకవర్గ అడపడచుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ వత్సలా దేవి, టీఆర్ఎస్ నాయకులు మోహన్ ముదిరాజు, బి.ఎస్.ఎన్. కిరణ్ యాదవ్, గంగాధర్ రావు, మాధవరం గోపాల్, ప్రతాప్ రెడ్డి, మహేందర్ ముదిరాజ్, మహమ్మద్ ఖాజా, జాంగిర్, చంద్రిక ప్రసాద్ గౌడ్, కలిదిండి రోజా, సుప్రజ, లత, హన్మంతరావు, రాజు గౌడ్, రవి గౌడ్, శివ ముదిరాజ్, శ్రీను, చిరంజీవి, శివాజీ, వెంకటేష్, జంగం మల్లేష్, శ్రీధర్ ముదిరాజ్, అనిల్, దయానంద్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, రాజు ముదిరాజ్, నర్సింగ్ రావు, తిరుపతి నాయక్, రెడ్యా నాయక్, శంకర్ నాయక్, హన్మంతు, స్వామి నాయక్, కృష్ణ నాయక్, అశోక్, జె పి నగర్ అధ్యక్షుడు రాజు, అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.






