కార్పొరేట‌ర్‌ను క‌లిసిన సిద్ధిఖ్‌న‌గ‌ర్ వాసులు – స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి హ‌మీద్‌పటేల్‌ హామీ

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిఖ్ నగర్ బస్తీకి చెందిన శ్రీ శ్రీ సంక్షేమ సంఘం సభ్యులు తమ‌ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కు వినతి పత్రం అందజేశారు. సిద్దిఖ్ నగర్ బస్తీ యొక్క డ్రైనేజీ అవుట్ లెట్ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు. అలాగే బస్తీ స్మశాన వాటిక సమస్యలు పరిష్కరించి, త్వరితగతిన అభివృద్ధి చర్యలు చేపట్టాలని కోరారు. స్మశాన వాటిక మధ్యలో పాత డ్రైనేజీ లైను ఉందని, అది పూర్తిగా పాడవ్వటం వల్ల మురుగు నీరు స్మశాన వాటిక పరిసరాలలోకి చేరటంతో, దహన సంస్కారం చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హమీద్ పటేల్ దృష్టికి తీసుకువచ్చారు. సిద్దిఖ్ నగర్ బస్తీలో మిగిలి ఉన్న అంతర్గత రోడ్లను పూర్తి చెయ్యాలని, కొన్ని చోట్ల నెలకొన్న వీధి దీపాల సమస్యలపై దృష్టిసారించి పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా సిద్దిఖ్ నగర్ బస్తీలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, ఇంట్లో వేడుకలు, బస్తీ యొక్క ముఖ్య కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించుకోవటానికి సరైన వేదిక లేక ఇబ్బందులను ఎదుర్కోవటం జరుగుతున్నదని బస్తీలోని ప్రభుత్వ స్థలంలో ఫంక్షన్ హాలు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ సిద్దిఖ్ నగర్ బస్తీలోని అంతర్గత రోడ్లను నిర్మాణం చేపట్టే చర్యలు తీసుకోవటం జరుగుతున్నదని, మిగిలి ఉన్న రోడ్లను త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నామని తెలిపారు. వీధి దీపాలు సమస్యలను పరిష్కారిస్తామన్నారు. ఇదివరకే స్మశాన వాటిక సమస్యలు, డ్రైనేజీ అవుట్ లెట్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా పనులు ఆలస్యం అయ్యాయని, పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయాని, త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫంక్షన్ హాలు నిర్మాణం కోరుతూ ఎమ్మెల్యే గాంధీ దృష్టికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ఫంక్షన్ హాలు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. బస్తీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో బస్తీ ప్రెసిడెంట్ బసవరాజు, జనరల్ సెక్రటరీ మహేష్, నందు, బల్లు, లక్ష్మి భాయి, రాము,యాదయ్య గౌడ్, గోపాల్ గౌడ్, మణెమ్మ, పలువురు బస్తీ నాయకులు తదితరులు ఉన్నారు.

కార్పొరేటర్ హమీద్ పటేల్ ను కలిసిన సిద్దిఖ్ నగర్ బస్తీ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here