నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు, తెలంగాణ కోసం పరితపించిన మహానుభావుడు , నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలు మరవలేనివని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ 87 వ జయంతి సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో జయంతి వేడుకలను నిర్వహించారు. కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పరితపించిన మహానుభావుడు అని, మహానుభావుడిని స్మరించుకుంటూ ఆయన చూపిన బాటలో ప్రయాణిస్తూ ఆశయాలను కొనసాగిద్దాం అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీను పటేల్ , సైదేశ్వరరావు,కాశినాథ్ యాదవ్ , పోతుల రాజేందర్ , శ్రీహరి,అనిల్, సత్తార్ ,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.