నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ ను అందరి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని సత్యనారాయణ ఎనక్లేవ్ వద్ద రూ.90 లక్షల అంచనా వ్యయంతో వరద నీటి కాలువ సహాయక గోడ (రిటైనింగ్ వాల్) నిర్మాణ పనులకు, దీప్తి శ్రీ నగర్ కాలనీ లోని తులిప్ రెసిడెన్సీ వద్ద రూ.60 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే వరద నీటి కాలువ సహాయక గోడ(రిటైనింగ్ వాల్) నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సహకారంతో చందానగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. వర్షకాలం దృష్ట్యా వరద నీటి కాలువకు రిటైనింగ్ వాల్ ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ రూపా దేవి, ఏఈ ధీరజ్ , ఏఈ అనురాగ్ , వర్క్ ఇన్ స్పెక్టర్లు విశ్వనాథ్, జగదీష్, ప్రేమ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ నారాయణ గౌడ్, చందానగర్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు జనార్దన్ రెడ్డి, కరుణాకర్ గౌడ్ , దాసరి గోపీ కృష్ణ, డి .వెంకటేష్ , గుడ్ల ధనలక్ష్మి , ఓ .వెంకటేష్, రవీంద్ర రెడ్డి, మిరియాల ప్రీతమ్, రాజశేఖర్ రెడ్డి, సీతారామయ్య, పూర్ణచందర్, చంద్రశేఖర్, కొండల్ రెడ్డి, ఎల్లమయ్య, పారునంది శ్రీకాంత్ రెడ్డి, సందీప్ రెడ్డి, హరీష్ , నిఖిల్, వరలక్ష్మీ, భవాని, పార్వతి, మాధవి సత్యనారాయణ ఎనక్లేవ్ ప్రెసిడెంట్ లోకేష్ తో పాటు శర్మ, సుభద్ర ,మూర్తి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.