వర్షానికి‌ పడిపోయిన‌ ప్రహరీ గోడను పరిశీలించిన ‌కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ కాలనీ కేంద్రీయ విహార్ సమీపంలో మంగళవారం కురిసిన వర్షానికి పడిపోయిన ప్రహరీ గోడను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ జీహెచ్ఎంసీ అధికారులతో కలసి బుధవారం పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఎలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురైనా డివిజ‌న్ ప్ర‌జ‌లు త‌న దృష్టికి తీసుకురావాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈఈ ప్రశాంతి, ఏఈ ధీరజ్ ,వర్క్ ఇన్ స్పెక్టర్ విశ్వనాధ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

వర్షానికి పడిపోయిన‌ ప్రహరీ గోడ ను పరిశీలిస్తున్న మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here