నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం పరిధిలో కాంట్రాక్టర్లు చేసిన పలు అభివృద్ధి పనులకు బిల్లులను వెంటనే చెల్లించాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదుట జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ధర్నా నిర్వహించారు. 2021 జనవరి 29 వ తేదీ నుంచి నేటి వరకు జీహెచ్ఎంసీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి సుమారు రూ. 600 కోట్ల నిధుల బిల్లులు రావాల్సి ఉందన్నారు. నో పెమెంట్స్, నో వర్క్స్ అనే నినాదంతో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లందరూ ఎస్ ఈ కి వినతి పత్రం అందజేశారు. ప్రధానకార్యదర్శి ఆర్. హన్మంత్ సాగర్, ఉపాధ్యక్షులు డి. శ్రవణ్ సాగర్, బి. శ్రీకాంత్ రెడ్డి, జోనల్ సభ్యులు ఏడీ. మధు, చంద్రశేఖర్ రెడ్డి, కె. మల్లికార్జున్, యాదగిరి, సురేందర్, లక్ష్మి కాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.