నమస్తే శేరిలింగంపల్లి:హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని కాయిదమ్మకుంట నుండి సితార గ్రాండ్ వరకు రూ. 8 కోట్లతో నిర్మిస్తున్న నాలా విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధికారులకు ఆదేశించారు.మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నాలా విస్తరణ పనులలో భాగంగా మిగిపోయిన అసంపూర్తి పనుల పురోగతి పై జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు, జనప్రియ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, హేమ దుర్గ అపార్ట్మెంట్ వాసులు, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి బుధవారం ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నాటి సమస్య కు నేటి తో పరిష్కారం కానుందన్నారు. జనప్రియ, హేమ దుర్గ అపార్ట్ మెంట్ వాసుల మధ్య తలెత్తిన సమస్య కు ఇరువురి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సమన్వయం తో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. నాలా విస్తరణతో శాశ్వత పరిష్కారం దిశగా భవిష్యత్తులో ముంపునకు గురి కాకుండా ఉంటుందన్నారు. నాలా విస్తరణ పనులకు సహృదయంతో ఒప్పుకున్న జనప్రియ, హేమదుర్గ వాసులకు ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
కరోనా వంటి విపతర్క పరిస్ధితుల్లో అభివృద్ధి, సంక్షేమం అగకూడదనే ఉదేశ్యం తో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని,అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాలు, నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా సన్నద్ధమవ్వాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రాజెక్ట్ , జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయం తో పని చేసి పనులలో పురోగతి సాధించాలని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో అధికారులు ఎస్ ఈ చిన్నా రెడ్డి, ఈఈ శ్రీకాంతిని , డీఈ సురేష్ ఏఈ ధీరజ్ , ప్రాజెక్ట్స్ డీఈ హరీష్ , ఏఈ శివకృష్ణ, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సంపత్, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులలడు గౌతమ్ గౌడ్,జనప్రియ వాసులు ప్రవీణ్ ,శ్రీనివాస్ గౌడ్, మీనాక్షి ,వెంకట్రావు, గురుప్రసాద్, రాజశేఖర్, చక్రపాణి, హేమదుర్గ వాసులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.